‘వకీల్‌సాబ్‌’ ఫస్ట్ సాంగ్ ప్రోమో చూశారా ?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘వకీల్‌సాబ్‌’గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. యువ దర్శకుడు వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బోనీ కపూర్ తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌ ‘పింక్‌’ సినిమాకు రీమేక్‌ ఇది. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. అది వైరల్ అయింది.

తాజాగా ‘వకీల్‌సాబ్‌’ చిత్రం నుంచి ఫస్ట్‌సాంగ్‌ ప్రోమో వచ్చేసింది. ‘మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా.. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా’ అంటూ సాగే పాటను సిధ్‌ శ్రీరామ్‌ ఆలపించారు. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. థమన్ సంగీతం అందించారు. రేపు (శనివారం) ఉదయం 10గంటలకు పూర్తి పాటను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.