రైతుబంధు నిధులు విడుదల
దేశాన్ని ఆకర్షించిన తెలంగాణ సంక్షేమ పథకం రైతుబంధు. పంట పెట్టుబడి కోసం ఉద్దేశించిన ఈ పథకాన్ని తీసుకొచ్చారు సీఎం కేసీఆర్. ఆ తర్వాత ఇదే పథకాన్ని చాలా రాష్ట్రాలు, కేంద్రం కూడా కాపీ కొట్టింది. తాజాగా రైతుబంధు పథకానికి తెలంగాణ ప్రభుత్వం మరో రూ.333.29 కోట్లు విడుదల చేసింది.
ఈ మేరకు నిధులు విడుదలకు వ్యవసాయశాఖ పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ ఏడాది ఇప్పటికే రూ.1350.61 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. తాజాగా మరో రూ.333.29 కోట్లు మంజూరు చేయడంతో 2019-20 ఆర్థిక సంవత్సరానికి మొత్తం రూ.1683.90 కోట్లు విడుదల చేసినట్లయింది.