జియో కస్టమర్లకి మరో షాక్

టెలికాం సంచలనం జియో ముందు మురిపించి.. తర్వాత ఏడిపిస్తోంది. జియో మరోసారి వైర్‌లెస్‌ డేటా టారిఫ్‌లను పెంచే యోచనలో ఉంది. ఇప్పటి వరకు 1జీబీ డేటాకు ఉన్న రూ.15 మొత్తాన్ని రూ.20కి పెంచేందుకు అనుమతి కోరుతూ ట్రాయ్‌కు లేఖ రాసింది.

పెంచిన డేటా ధరలను తక్షణమే కాకుండా ఆరు నుంచి తొమ్మిది నెలల్లో అమలు చేయాలని భావిస్తున్నట్లు ట్రాయ్‌కు రాసిన లేఖలో తెలిపింది. పెరిగిన డేటా ధరలు అన్ని టారిఫ్‌లకు వర్తిస్తాయని పేర్కొంది. అయితే వాయిస్‌ కాల్స్‌ ధరలను మాత్రం యథాతథంగా కొనసాగించనున్నట్లు ట్రాయ్ కి రాసిన లేఖలో పేర్కొంది.