విజయ్ దేవరకొండ అరెస్ట్

నకిలీ విజయ్ దేవరకొండని పోలీసులు అరెస్ట్ చేశారు. హీరో విజయ్ దేవరకొండ పేరిట నకిలీ ఫేస్ బుక్, వాట్సాప్ నెంబర్ ని క్రియేట్ చేసి.. అమ్మాయిలకి గాలం వేస్తున్న విషయం వెలుగులోనికి వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై విజయ్ దేవరకొండ మేనేజర్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. దానిపై దర్యాప్తు చేసిన పోలీసులు నకిలీ ఖాతాలునిజామాబాద్ జిల్లా నస్సుల్లాబాద్ మండలం మీర్జాపూర్ కు చెందిన సాయికుమార్‌ గా గుర్తించారు. 

అతడికి నోటీసులు పంపిన పోలీసులు.. అదుపులోనికి తీసుకున్నారు. నకిలీ విజయ్ పై ఐపీసీ సెక్షన్‌ 66ఏ కింద కేసు నమోదు చేశారు. ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో చాలానే వెలుగులోనికి వస్తున్నాయి. ఇటీవల దర్శకుడు శేఖర్ కమ్ముల పేరిట మోసాలు జరిగిన విషయం వెలుగులోనికి వచ్చిన సంగతి తెలిసిందే.