తెలంగాణ ప్రగతిపథంలో నడుస్తోంది

సీఎం కేసీఆర్‌ కృషితో తెలంగాణ ప్రగతిపథంలో నడుస్తోందన్నారు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌. శుక్రవారం తెలంగాణ వార్షిక బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తమిళిసై తొలిసారి ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. సీఎం కేసీఆర్‌ కృషితో తెలంగాణ ప్రగతిపథంలో నడుస్తోంది. తక్కువ కాలంలోనే తెలంగాణ అనేక రంగాల్లో అగ్రగామిగా ఎదిగింది. పక్కా ప్రణాళికతో కేసీఆర్‌ సమస్యలను అధిగమించి రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపారని గవర్నర్ అన్నారు.

గవర్నర్‌ తమిళిసై ప్రసంగంలోని ముఖ్యాంశాలు :

* పేదల జీవన భద్రత కోసం ప్రభుత్వం సంక్షేమ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది.

* త్వరలో 57 ఏళ్లు నిండిన వారందరికీ ఆసరా పింఛన్లు అందనున్నాయి

* వృద్ధాప్య పింఛను అర్హత వయసు 65 నుంచి 57 ఏళ్లకు తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది

*  తెలంగాణలో కరెంట్ కోత లేకుండా సరఫరా చేస్తున్నాం

* రాష్ట్రంలోని అన్ని రంగాలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేస్తున్నాం

* రైతులకు విత్తనాలు, ఎరువులు సకాలంలో అందిస్తున్నాం. కల్తీ విత్తనాలు, నకిలీ ఎరువులు విక్రయించే వారిపై పీడీ యాక్టుతో చర్యలు

* 24 గంటల విద్యుత్‌ సరఫరా వల్ల రైతులు భూమినంతా సాగులోకి తెస్తున్నారు.

* యువత ఉపాధి కోసం నడుపుకొనే ఆటోలు, రైతుల ట్రాక్టర్లపై రవాణా పన్నును ప్రభుత్వం రద్దు చేసింది

* ఎస్సీ, ఎస్టీలు తమ ఇళ్లకు ఉపయోగించే విద్యుత్‌ను 101 యూనిట్ల వరకు ఉచితంగా అందిస్తోంది.

* దేశంలో ఎక్కడా లేని విధంగా పేద విద్యార్థుల కోసం 959 రెసిడెన్షియల్‌ పాఠశాలల ఏర్పాటు

* డ్రైవర్లు, హోంగార్డులు, వర్కింగ్‌ జర్నలిస్టులకు ప్రభుత్వం రూ.5లక్షల ప్రమాద బీమా కల్పించింది

* ఇమామ్‌, మౌజమ్‌లకు ప్రభుత్వం నెలకు రూ.5వేలు చొప్పున భృతి అందిస్తోంది.

* ప్రపంచంలో అతి భారీ బహుళ దశల ఎత్తిపోతల పథకంగా కాళేశ్వరం చరిత్ర సృష్టించింది. త్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పూర్తవుతాయి