కరోనాపై జియో కాలర్‌ట్యూన్‌

ప్రపంచదేశాలని వణికిస్తున్న కరోనా వైరస్ కి మందు లేదు. ముందు జాగ్రత్త చర్యలు పాటించడమే శరణ్యం. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌పై ప్రజల్లో నెలకొన్న భయాలను తొలగించి అవగాహన కల్పించేందుకు పలు సంస్థలు ముందుకువస్తున్నాయి. ఇందులో భాగంగా
‘రిలయన్స్‌ జియో’ కూడా కొవిడ్‌-19పై అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టుంది. ఇందుకోసం ఉచిత కాలర్‌ట్యూన్‌ను రూపొందించింది.

నేటి నుంచే దీనిని అందుబాటులోకి తెచ్చింది. కరోనాకు సంబంధించి ఆరోగ్య సలహాలు, సూచనలతోపాటు భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌కు సంబంధించిన తాజా సమాచారం ఈ కాలర్‌ట్యూన్‌ ద్వారా అందించనున్నారు. ఈ ఆటోమెటిక్‌ కాలర్‌ ట్యూన్‌ను ఏ జియో వినియోగదారుడైనా ఉచితంగా పొందొచ్చు.