సమంత నువ్వు పవర్‌ ఫుల్‌

సమంత నువ్వు పవర్ ఫుల్ అంటున్నారు నెటిజన్స్. ఫిట్‌నెస్‌ విషయంలో తరచూ అభిమానులను ఫిదా చేస్తుంటుంది సమంత. తన వర్కౌట్లకు సంబంధించిన వీడియోలను సోషల్‌మీడియాలో షేర్ చేస్తుంటుంది. గతంలో సామ్ షేర్ చేసిన జిమ్ వీడియాలకి నెటిజన్స్ ఫిదా అయ్యారు. తాజాగా సమంత జిమ్‌లో తన వర్కౌట్లకు సంబంధించిన కొన్ని వీడియోలను ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్‌ చేశారు.
 
వర్కౌట్లలో భాగంగా 100 కిలోల బరువును ఎత్తి ఆశ్చర్యానికి గురి చేశారు. దీనికి సంబంధించిన వీడియోను షేర్‌ చేసిన సామ్‌.. ‘మరలా నిన్ను కలవడం చాలా సంతోషంగా ఉంది నా పాత నేస్తమా.. 100 కేజీల సుమో డెడ్‌ లిఫ్ట్‌’ అని సమంత పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘వామ్మో.. సమంత నువ్వు సూపర్‌’, ‘సమంత నువ్వు పవర్‌ ఫుల్‌’ అని కామెంట్లు పెడుతున్నారు.