అలా.. త్రివిక్ర‌మ్ నా డిప్రెష‌న్ పోగొట్టారు !

అజ్ఞాత‌వాసి ఆడియో వేడుక‌లో మాట్లాడినంత‌సేపు ఆసాంతం త్రివిక్ర‌మ్ గురించే ప్ర‌స్తావించారు ప‌వ‌న్. తాను డిప్రెష‌న్ లో మునిగిపోయి ఉన్న‌ప్పుడు త‌న‌కు ఎంతో అండ‌గా ఉన్నాడంటూ ప‌దే ప‌దే త్రివిక్ర‌మ్ గురించే చెప్పుకొచ్చారు. త‌న ర‌క్తం పంచుకు పుట్టిన వారితో కూడా తిట్టుకునేంత చ‌నువు లేద‌ని, త్రివిక్ర‌మ్ అంత‌కంటే ఎక్కువ‌ని చెప్ప‌క‌నే చెప్పారు. అంత‌లా త్రివిక్ర‌మ్ త‌న‌కు అండ‌గా నిల‌బ‌డ్డార‌న్నారు ప‌వ‌న్.

జ‌ల్సా స‌మ‌యంలో తాను పూర్తిగా డిప్రెష‌న్ లో ఉండిపోయాన‌ని, ఆ స‌మ‌యంలో త్రివిక్ర‌మ్ త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి ఒక వ్య‌క్తిని ప‌రిచ‌యం చేస్తాను, డిప్రెష‌న్ పోతుంద‌ని చెప్పార‌ని జ‌రిగింది వివ‌రించారు ప‌వ‌న్. తీరా చూస్తే అత‌ను తీసుకు వ‌చ్చింది వ్య‌క్తిని కాద‌ని ఒక పుస్త‌క‌మ‌ని చెప్పారు. నాదేశం ,నా ప్ర‌జ‌లు అనే ఆపుస్త‌కం చ‌దివిన‌పుడు త‌న డిప్రెష‌న్ మొత్తం పోయింద‌ని, స‌మాజానికి తాను ఏదైనా చేయ‌గ‌ల‌న‌నే స్పూర్తి వ‌చ్చింద‌ని ప‌వన్ చెప్పారు.