‘మాస్టర్’ ఆడియో ఫంక్షన్.. ముహూర్తం ఫిక్స్ !

లోకేశ్‌ కనగరాజ్‌ డైరెక్షన్ లో విజయ్ హీరోగా ‘మాస్టర్‌’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.  మాళ‌విక మోహ‌న్ హీరోయిన్‌. విజయ్‌సేతుపతి, శాంతను భాగ్యరాజ్‌, ఆండ్రియా తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంపై తొలి నుంచి భారీ అంచనాలున్నాయి. ఫస్ట్‌లుక్‌ విడుదలయ్యాక ఆ అంచనాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ నెల 15న సినిమా ఆడియో వేడుకని నిర్వహించబోతున్నారు. ఈ సినిమాలో విజ‌య్‌ది ద్విపాత్రాభిన‌యం. క‌ళాశాల విద్యార్థిగా, ప్రొఫెస‌ర్‌గా డ‌బుల్ రోల్ పోషిస్తున్నాడు.  ఈ చిత్రనైకి అనిరుధ్‌ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఈ చిత్రాన్ని తెలుగులో ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకం పై మహేశ్‌ కోనేరు రిలీజ్ చేస్తున్నారు