తెలంగాణ వార్షిక బడ్జెట్ 2020-21 హైలైట్స్
శాసనసభలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2020-21 ను ప్రవేశపెడుతున్నారు. హరీష్ రావు బడ్జెట్ ని ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రగతిశీల రాష్ట్రంగా ముందుకు వెళుతోందనిహరీష్ రావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం నూతన అధ్యాయాన్ని ప్రారంభించిందన్నారు.
బడ్జెట్ అంటే కేవలం కాగితాపై రాసే అంకెలు కాదు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటా తగ్గింది. తెలంగాణలో వ్యవసాయ రంగం అభివృద్ధిపథంలో దూసుకెళుతోంది. రైతుబంధు పథకాన్ని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా రైతుబంధు పథకాన్ని కాపీ కొట్టిందని హరీష్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రస్థావించారు.