రూ.1,82,914 కోట్లతో తెలంగాణ వార్షిక బడ్జెట్
రాష్ట్ర ఆర్థిక మంత్రి టి.హరీశ్ రావు 2020-21 వార్షిక బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టారు. రూ.1,82,914 కోట్లతో తెలంగాణ బడ్జెట్ ను రూపొందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వాస్తవిక దృక్పథంతో 2020-21 బడ్జెట్ రూపకల్పన జరిగిందని వివంచారు. స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన ఉద్యమనేత కేసీఆర్. కేసీఆర్ దార్శనికతతో తెలంగాణ ప్రగతిశీల రాష్ట్రంగా కొనసాగుతోంది. కేసీఆర్ సమగ్ర దృష్టి, శ్రద్ధాశక్తుల ప్రతిబింబమే ఈ బడ్జెట్ అని వెల్లడించారు.
ఆర్థిక మాంద్యం ప్రభావం రాష్ట్రంపై పడిందని హరీష్ వివరించారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా బడ్జెట్ లో వేసుకున్న అంచనాల కంటే రూ.3,731 కోట్లు తగ్గిందని వెల్లడించారు. బడ్జెట్ లో రైతు బంధు పథకానికి 14 వేల కోట్లరూపాయలు కేటాయించినట్లు హరీష్ తెలిపారు. అలాగే రైతు బీమా కోసం1, 141 కోట్ల రూపాయలు కేటాయించారు.