రైతు సమన్వయ సమితి పేరు మారింది
సీఎం కేసీఆర్ సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా రైతు సమన్వయ సమితిలని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. రైతులకి విలువైన సలహాలు, సూచనలు అందించాలనే లక్ష్యంతో ఈ సమితిలని ఏర్పాటు చేశారు. ఏ కాలంలో ఏ పంటలు వేసుకోవాలి. ఎలా మార్కెట్ చేసుకోవాలి.. తదితర విషయాల్లో రైతులకి సూచనలు చేస్తుంది రైతు సమన్వయ సమితి.
ఇప్పుడీ పేరుని మార్చారు. రైతు బంధు సమితిగా మార్చారు. ఈ మేరకు తన బడ్జెట్ సమావేశంలో మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఇక రైతు వేదికల నిర్మాణం కోసం 350 కోట్ల రూపియలు కేటాయించారు. వ్యవసాయం, సాగునీటి రంగాలకు బడ్జెట్ లో పెద్దపీఠ వేశారు. సాగునీటి రంగానినకి 11 వేల 64 కోట్ల రూపాయలు కేటాయించారు. అలాగే రైతు రుణమాఫీ కోసం 6,225 కోట్లు కేటాయించారు. రైతు వేదికల నిర్మాణానికి, విత్తనాల సబ్సిడీకి, పాడి రైతుల ప్రోత్సాహకానికి కూడా నిధులను కేటాయించారు.