కరోనా ఎఫెక్ట్.. నితిన్ పెళ్లి వాయిదా ?
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఓ ఇంటివాడుకాబోతున్న సంగతి తెలిసిందే. నాగర్‌కర్నూల్‌కు చెందిన సంపత్‌కుమార్, నూర్జహాన్ దంపతుల రెండవ కుమార్తె షాలినితో ఇటీవల నితిన్‌కు నిశ్చితార్థం జరిగింది. ఏప్రిల్ లో వీరి పెళ్లి జరగాల్సిఉంది. అయితే, కరోనా ఎఫెక్ట్ తో నితిన్ పెళ్లిని వాయిదా వేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.
దుబాయ్‌లోని ఓ హోటల్‌లో ఏప్రిల్ 16న వివాహానికి ముహూర్తం పెట్టుకున్నారు. ఏప్రిల్ 21న హైటెక్స్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయాలని భావించారు. ఇంతలో నితిన్ పెళ్లి వాయిదా అనే న్యూస్ బయటికొచ్చింది. ఇందులో నిజమెంత ? అనేది తెలియాల్సి ఉంది.