33ఏళ్ల నటితో.. 51ఏళ్ల నటుడు డేటింగ్‌ !

ప్రేమకు వయసు తేడా సమస్యే కాదంటున్నాడు నటుడు రాహుల్ దేవ్. ఈ బాలీవుడ్ నటుడు టాలీవుడ్ లో ప్రతినాయకుడి మెప్పించాడు. 51 యేళ్ల రాహుల్‌ 33 యేళ్ల నటి, మోడల్‌ ముగ్దా గాడ్సేతో డేటింగ్‌లో ఉన్నారు. వీరిద్దరి మధ్య వయసు తేడా 18యేళ్లు. దీనిపై రాహుల్ ని ప్రశ్నించగా.. సింపుల్ ప్రేమకు వయసు తేడా పెద్ద సమస్యే కాదన్నాడు.

1998లో రాహుల్ తన చిన్ననాటి స్నేహితురాలు రైనాను పెళ్లి చేసుకున్నారు. వీరికి సిద్ధార్థ్‌ పుట్టాడు. బాబు 11 ఏళ్ల వయసులో రైనాకు క్యాన్సర్‌ ఉందని తెలిసింది.  ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించి 2009లో రైనా కన్నుమూశారు. స్నేహితుడి పెళ్లిలో ముగ్దను కలిశాడు రాహుల్ దేవ్. మొదట స్నేహితులయ్యారు. ఆ తర్వాత ఫ్యామిలీ ఫంక్షన్లలో కలిసేవాళ్లట. అలా బంధం దృఢపడింది. ఆపై తరచూ కలుసుకునేవాళ్లం. ప్రస్తుతం హ్యాపీగా డేటింగ్ చేసుకొంటున్నారు.