‘క్రాక్’ బిజినెస్ సూపర్  

మాస్ మహారాజా రవితేజ సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ‘రాజా ది గ్రేట్’ తర్వాత రవితేజకి మరో హిట్ లేదు. టచ్ చేసి చూడు, నేల టికెట్, అమర్ అక్భర్ ఆంథోనీ, డిస్కోరాజా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ నేపథ్యంలో రవితేజ ఆశలన్నీ ‘క్రాక్’పైనే పెట్టుకున్నాడు. గోపీచంద్-రవితేజ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రమిది. గతంలో వీరి కలయికలో వచ్చిన ‘డాన్ శీను’, ‘బలుపు’ చిత్రాలు మంచి వినోదాన్ని పంచాయి. ఈ నేపథ్యంలోనే క్రాక్ పై భారీ అంచనాలున్నాయి.

మే 8న క్రాక్ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ క్లోజ్ అయింది. వరంగల్ శ్రీను నైజాం ఏరియాకు 6.30 కోట్లకు క్రాక్ థియేటర్ హక్కులు తీసుకున్నారు. సీడెడ్ ను 3.33 కోట్లకు క్లోజ్ చేసారు. ఆంధ్ర ను ఎనిమిది కోట్ల రేషియోలో క్లోజ్ చేయడం విశేషం. నాన్ థియేటర్ మాత్రం ఇంకా కాలేదు. అన్నీ కలిపి 20 కోట్ల వరకు రావాలని చూస్తున్నారు.