ఈ నెల 28 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆదివారమే ఆర్థిక మంత్రి హరీష్ రావు బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. రేపటి నుంచి బడ్జెట్ కేటాయింపులపై హాట్ హాట్ చర్చ జరగనుంది. తాజాగా ఏపీ అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ రిలీజ్ అయింది. ఈ నెల ఈ నెల 28 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. 

ఈ సందర్భంగా గవర్నర్ హరిచందన్ ఉభయసభలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. 2020-2021 ఆర్థిక సంవత్సరానికి ఈ నెల 31న (మంగళవారం) అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేందర్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత రోజున బీఏసీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలన్నది నిర్ణయించనున్నారు.