తండ్రి ఆస్తికోసం అమృత మాస్టర్ ప్లాన్ ?
మారుతీరావు ఆస్తిపై అమృత కన్నేసిందా ? ఇన్నాళ్లు తండ్రి మారుతీరావుని ఉరితీయాలని డిమాండ్ చేసిన అమృత ఆస్తుల కోసం ఇప్పుడు హఠాత్తుగా ప్రేమ నటిస్తోందా ?? అంటే అవుననే అంటున్నాడు మారుతీరావు సోదరుడు, అమృత బాబాయ్ శ్రవణ్. తండ్రి చనిపోతే శుభవార్త అన్న అమృత.. ఇప్పుడు ఆయన ఆస్తి కోసం, డబ్బు కోసం డ్రామాలు ఆడుతోందని ఆరోపించారు. నిన్నటి వరకు లేని ప్రేమ ఇప్పుడెలా పుట్టుకొచ్చిందని ప్రశ్నించారు.
సోదరుడికి చెందిన ఒక్క పైసా తనకు అక్కర్లేదని శ్రవణ్ అన్నారు. ప్రణయ్ హత్యకు ముందు తనకు, అన్నయ్య మారుతీరావుకు మాటల్లేవని చెప్పారు. అన్యాయంగా తనను జైలుకు పంపించారని శ్రవణ్ అన్నారు. తన వల్ల అపాయం అమృత తల్లి గిరిజకి అపాయం ఉందంటే తాను దేనికైనా సిద్ధమని చెప్పారు. అమృత తల్లితో ఉంటే తనకేమీ అభ్యంతరం లేదని శ్రవణ్ చెప్పుకొచ్చాడు.