అనుష్కపై ప్రేమని చూపించండీ.. !

స్వీటీ అనుష్క అభిమానులకి గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ అనడం కంటే బంపర్ ఆఫర్ అనాలేమో. అనుష్కపై అభిమానం చాటుకొనే అవకాశం అభిమానులకి లభించింది. స్వీటీపై ఎంత ప్రేమ ఉన్నది తెలియజేసేందుకు నిశ్శబ్ధం చిత్రబృందం ఓ అవకాశాన్ని కల్పించింది. దీని కోసం చేయాల్సింది ఏంటంటే.. ? అనుష్క గురించి ఏదైనా చెప్పవచ్చు. ఆమెకి సంబంధించిన విషయాలని ఏదైనా పంచుకోవచ్చు. వీడియోలు చేయొచ్చు, టిక్ టాక్ లు చేయొచ్చు. సెల్ఫీలు పంచుకోవచ్చు. స్వీటీతో ఉన్న తీపి జ్ఝాపకాలని పంచుకోవచ్చు. మొత్తంగా అనుష్కపై ప్రేమని చూపించవచ్చు. వీటిని #GiftToSakshi హాష్ ట్యాగ్ కి పంపించాలని నిశ్శబ్ధం చిత్రబృందం కోరింది.

కోన ఫిలిం కార్పోరేషన్ బ్యానర్ లో కోనవెంకట్ నిర్మాణంలో హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో మాధవన్, అంజలి, హాలీవుడ్ నటుడు మ్యాడ్‌సన్, షాలినీ పాండే, అవసరాల శ్రీనివాస్, సుబ్బరాజు కీలక పాత్రలు పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్ పతకాలపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జనవరిలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన
నిశ్శబ్ధం కొన్ని కారణాల వలన ఏప్రిల్ 2కి వాయిదా పడిన సంగతి తెలిసిందే.ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించారు.