‘వి’ పాట వచ్చేసింది

ఉగాది సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది ‘వి’. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రమిది. నివేదా థామస్, అతిథిరావు హైదరి కథానాయికలు. ఇందులో సుధీర్ బాబు రక్షకుడిగా, నాని రాక్షసుడిగా కనిపించబోతున్నారు. ఉగాధి కానుకగా ఈ నెల 15న ‘వి’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా ఈ సినిమా నుంచి ‘వస్తున్నా.. వచ్చేస్తున్నా.. వద్దన్నా వదిలేస్తానా..’ అంటూ సాగే సాంగ్ రిలీజ్ చేశారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన పాటని శ్రేయా ఘోషల్‌, అమిత్‌ త్రివేది, అనురాగ్‌ కులకర్ణి ఆలపించారు. అమిత్‌ త్రివేది సంగీతం అందించారు. సుధీర్ బాబు, నివేదా, నానిలపై ఈ పాటని చిత్రీకరించారు.