కల్యాణ్ ఊరమాసు 

హీరోగా, నిర్మాతగా రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు కల్యాణ్ రామ్. హీరోగా ఆయన నుంచి ఈ యేడాది వచ్చిన ‘ఎంతమంచివాడవురా’ నిరాశపరిచింది. ఇక నిర్మాతగా తారక్-త్రివిక్రమ్ సినిమాని నిర్మించనున్నాడు. హారిక అండ్ హాసినీ క్రీయేషన్స్ తో కలిసి ఈ సినిమా నిర్మించనున్నారు. అంతకంటే ముందు కల్యాణ్ రామ్ నుంచి మరో సినిమా రాబోతుంది.
   
కల్యాణ్‌రామ్ కొత్త దర్శకుడితో భారీ సోషియో ఫాంటసీ చిత్రాన్ని చేయబోతున్నారు. ‘ఢీ’ నిర్మాత మల్లిడి సత్యనారాయణరెడ్డి తనయుడు మల్లిడి వేణు ఈ చిత్రం ద్వారా దర్శకుడి ఆ పరిచయం కాబోతున్నారు. 13వ శతబ్దానికి చెందిన కథ ఇదని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం కల్యాణ్‌రామ్ సరికొత్త గెటప్‌లో గుబురు గడ్డం, మీసం, జట్టుతో కనిపించబోతున్నారట. ఊరమాసు లుక్ లో కల్యాణ్ భయంకరంగా కనిపిస్తున్నారు.