అమరావతిలో వ్యభిచార కేసు.. ప్రముఖులు ఉన్నారా ?

ఏపీ రాజధాని అమరావతిలో గుట్టుగా జరుగుతున్న వ్యభిచార దందా బయటడింది. చినకాకాని గ్రామ పంచాయతీ పరిధిలోని రాజ్‌కమల్ రోడ్డులో ఇద్దరు మహిళలు ఓ ఇల్లును అద్దెకు తీసుకొని కొంతకాలంగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఈ సమాచారం తెలుసుకొన్న పోలీసులు పక్కా ప్లానింగ్ తో వ్యభిచార గృహంపై దాడి చేసి.. వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న ఇద్దరు మహిళలతోపాటు విటుడిని అరెస్టు చేశారు.

ఈ వ్యభిచారం వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనేది తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంతో ప్రముఖులకి సంబంధాలు ఉన్నాయనే అనుమానాలని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇటీవల ఓ వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేయగా.. జబర్థస్త్ నటులు దొరబాబు, పరదేశీలు పట్టుబడిన సంగతి తెలిసిందే.