వైష్ణవ్ తేజ్.. మెగా కార్డ్ !

మెగా యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతోన్న చిత్రం ‘ఉప్పెన’. సుకుమార్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో  వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి నటిస్తున్నారు. తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి విలన్‌గా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వైష్ణవ్ తేజ్ మెగా కార్డ్ వాడేశాడు. ఉప్పెన నుంచి తాజాగా కొత్త పోస్టర్ ని వదిలారు. ఇందులో ఓ వైపు మెగాస్టార్ చిరంజీవి, మరో వైపు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బొమ్మలు ఉన్నాయి.వీటి మధ్యలో కూర్చొని ఉన్న వైష్ణవ్ తేజ్.. వీరి నా ధైర్యం అన్నట్టుగా పోజులిచ్చేశాడు. మెగా హీరోలందరు మెగా కార్డ్ ని వాడుకున్నవారే. ఇప్పుడు వైష్ణవ్  తేజ్ కూడా మెగా కార్ఢుని వాడుకోవడం మొదలుపెట్టాడు. ఎంత మెగా కార్డ్ వాడినా.. మనలో టాలెంట్ ఉండాలి. అప్పుడే హీరోగా రాణించగలుగుతారు. మరీ.. వైష్ణవ్ తేజ్ ఏం చేస్తాడో చూడాలి.