తెలంగాణ భాజాపా కొత్త అధ్యక్షుడుగా బండి సంజయ్
తెలంగాణ భాజాపా కొత్త అధ్యక్షుడుగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు భాజాపా అధిష్టానం ప్రకటించింది. 2005లో కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో 48వ డివిజన్ నుంచి గెలుపొందారు సంజయ్. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి గెలుపొందారు.
ఆర్‌ఎస్‌ఎస్, ఏబీవీపీ సంస్థల్లో బండి సంజయ్ చురుగ్గా పనిచేశారు. వివాదరహితుడుగా ఆయనకి పేరుంది. స్థానికంగా పార్టీ శ్రేణులకి అందుబాటులో ఉండే సంజయ్ కి అందరివాడులా పేరుంది. ఆయనైతే.. అధికార తెరాసని గట్టిగా ఢీకొంటారని బీజేపీ అధిష్టానం విశ్వసించింది. ఇన్నాళ్లు తెలంగాణ భాజాపా రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న లక్ష్మణ్ ది మెతక వైఖరి అని చెప్పుకొనేవారు. మరీ.. కొత్త అధ్యక్షుడు బండి సంజయ్ అయినా.. దూసుకెళ్తారేమో చూడాలి.
Congratulations @bandisanjay_bjp on being appointed as the new State President of @BJP4Telangana . pic.twitter.com/lE6xC6m2Kp
— B L Santhosh (@blsanthosh) March 11, 2020