రజినీ పార్టీలో యువతకి పెద్దపీఠ

సూపర్ స్టార్ రజనీకాంత్ రెండేళ్ల క్రితమే పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేశారు. రాజకీయాల్లోకి వస్తున్నా.. త్వరలోనే పార్టీ, అజెండాని ప్రకటిస్తానన్నారు. ఇప్పటి వరకు ఆ పని చేయలేదు. ఈ నేపథ్యంలో అసలు రజనీ రాజకీయాల్లో వస్తారా ? లేక నిర్ణయంపై యూ టర్న్ తీసుకున్నారా ? అనుమానాలు మొదలయ్యాయ్. తాజాగా వాటన్నింటికి పులిస్టాప్ పెడుతూ.. పొలిటికల్ ఎంట్రీపై మరోసారి స్పష్టమైన ప్రకటన చేశారు రజనీకాంత్.

త్వరలోనే తాను ఓ రాజకీయ పార్టీని ప్రకటిస్తానని రజసీ మరోసారి స్పష్టం చేశారు. జయలలిత మరణం తర్వాత తమిళనాడు రాజకీయాల్లో శూన్యత ఏర్పడింది. అప్పుడే రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకొన్నా అన్నారు. అంతేకాదు.. తన పార్టీలో యువతకి పెద్దపీఠ వేస్తా. దాదాపు 65 శాతం సీట్లు వారికే కేటాయిస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి పదవిపై తనకి ఆసక్తిలేదు. మంచి విద్యావంతుడిని ఆ సీటుపై కూర్చోబెడతానని రజినీ తెలిపారు. రిటైర్డ్‌ ఐఏస్‌, ఐపీఎస్‌లని పార్టీలలోకి ఆహ్వానిస్తానని రజనీ తెలిపారు.