అమెరికాలో తెలంగాణ వ్యక్తి మృతి
అమెరికాలో తెలంగాణకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి చెందాడు. కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలానికి చెందిన బూర్ల అరుణ్ కుమార్(41) అమెరికాలో స్థిరపడ్డాడు. గత 16యేళ్లుగా ఆయన అమెరికాలోనే ఉంటున్నారు. బూర్ల అరుణ్ కుమార్ హ్యుస్టన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. ఇటీవల అనారోగ్యానికి గురైన అరుణ్ కుమార్ శ్వాస్త తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడుతూ మృతి చెందారు. అయితే ఆయనకి కరోనా సోకిందా ? అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు.