ప్రేమ పెళ్లిపై త్రిష ప్రకటన

స్టార్ హీరోయిన్ త్రిష ఇప్పటికే ఓ ఇల్లాలు కావాల్సింది. గతంలో ఆమెకి పెళ్లి కుదిరింది. నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ ఆ పెళ్లి క్యాన్సిల్ అయింది. దాంతో కొన్నాళ్లు ఖాళీగా ఉన్న త్రిష.. ఆ తర్వాత తిరిగి సినిమాల్లో బిజీ అయింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. ఈ నేపథ్యంలో త్రిషని పెళ్లెప్పుడు ? పెద్దలు పెళ్లి సంబంధాలు చూస్తున్నారా ?? అని అడిగితే.. ఆసక్తికర సమాధానం చెప్పింది.

తాను పెద్దలు చూసిన అబ్బాయిని చేసుకోను. ప్రేమించి పెళ్లాడతా. కాబోయేవాడు హీరో కావాల్సిన పనిలేదు. అందంగా ఉండాల్సిన పనిలేదు. మంచివాడై ఉండాలి. తనని బాగా చూసుకోవాలి. అర్థం చేసుకోవాలి. అలాంటి వ్యక్తి పరిచయం అయితే కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని తెలిపింది. ప్రస్తుతం త్రిష కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నారు. దాంతోపాటు మణిరత్నం మల్టీస్టారర్ లోనూ నటిస్తున్నారు. ఇవీగాక.. మరో రెండు సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి.