కేకే’కు మరోసారి ఛాన్స్.. కవితకు నిరాశ !

సీఎం కేసీఆర్ రాజ్యసభ అభ్యర్థులని ఖరారు చేశారు. కె. కేశవరావు, కేఆర్‌ సురేష్‌రెడ్డిలను రాజ్యసభకు నామినేట్‌ చేస్తూ సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. వీరు శుక్రవారం ఉదయం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. వాస్తవానికి కేకే స్థానంలో కవితని రాజ్యసభకు పంపే ప్రయత్నాలు జరుగుతున్నట్టు ప్రచారం జరిగింది. కానీ సీఎం కేసీఆర్ కేకేకు మరోసారి అవకాశం కల్పించారు.

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ స్పీకర్‌గా పనిచేసిన సురేష్‌రెడ్డిని కూడా టీఆర్‌ఎస్‌ తరఫున రాజ్యసభకు పంపాలని కేసీఆర్‌ నిర్ణయించారు. కాంగ్రెస్‌లో సీనియర్‌ నేతగా ఉన్న సురేష్‌రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌లో చేరిన సంగతి తెలిసిందే. రాజ్యసభ అభ్యర్థులుగా కవిత, ప్రొఫెసర్‌ సీతారాం నాయక్, మందా జగన్నాథం, కేకే తదితరుల పేర్లు వినిపించాయి. అయితే, కేకే, సురేష్ రెడ్డిలకి అవకాశం కలిపిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకొన్నారు.