ఐపీఎల్ రద్దుపై గంగూలీ ఏమన్నారంటే ?
ఎట్టిపరిస్థితుల్లో ఐపీఎల్ నిర్వహించి తీరుతామని బీసీసీ అధ్యక్షుడు గంగూలీ చెబుతున్న సంగతి తెలిసిందే. కానీ ఐపీఎల్ ని వాయిదా వేయక తప్పదు. అంతేకాదు ఐపీఎల్ వాయిదా పడిందా ? మొత్తానికే క్యాన్సిల్ కానుందా ?? తెలియాలంటే మరికొద్దిరోజులు ఆగాల్సిందే. అయితే ఐపీఎల్ నిర్వహణపై గంగూలీ తాజాగా స్పందించారు.
“పరిస్థితిని సమీక్షిస్తున్నాం. వారం వారానికి పరిస్థితి సీరియస్ అవుతుంది. వీలైంత వరకు ఐపీఎల్ ని నిర్వహించేందుకే ప్రయతిస్తాం. అదే సమయంలో ప్రజల రక్షణ కూడా ముఖ్యమే” అన్నారు గంగూలీ. ఇక వచ్చే నెల 15లోగా దేశంలో కరోనా వైరస్ కంట్రోల్ లోకి రాకపోతే.. ఈ యేడాది ఐపీఎల్ రద్దు అవ్వడం ఖాయమని క్రికెట్ పరిశీలకి చెబుతున్నారు.