కరోనా నివారణకి టీటీడీ యాగం
కరోనా వైరస్ నివారణ కోసం ధన్వంతరి మహాయాగం చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఈ నెల 19 నుంచి 21 వరకు ఈ యాగాన్ని నిర్వహించనున్నారు. అంతేకాదు.. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. భక్తులు నేరుగా స్వామివారిని దర్శించుకునేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. మునుపటిలా క్యూ కాంప్లెక్స్‌లో భక్తులు వేచి చూసే అవకాశం లేకుండా.. నేరుగా భక్తులని స్వామివారి దర్శనానికి పంపించనున్నారు.ఇలా గంటకి 4వేల మంది భక్తులకు మాత్రమే దర్శనం ఏర్పాట్లు చేస్తున్నారు.
మరోవైపు వసంతోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రకళషాభిషేకం, ఇతర విశేష పూజలు, ప్రత్యేక పూజలను తాత్కాలికంగా రద్దు చేశారు. కరోనాపై టీటీడీ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోంది. టాస్క్‌ఫోర్స్, కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని టీటీడీ నిర్ణయించింది.