దేశవాలీ టోర్నీలన్నీ రద్దు : బీసీసీఐ

కరోనా ప్రభావం అన్నీ రంగాలపై పడుతోంది. కరోనా ఎఫెక్ట్ తో ఈ  నెల 29 నుంచి జరగాల్సిన ఐపీఎల్ వచ్చే యేడాదికి 15కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా దేశవాలీ టోర్నీలన్నీ రద్దు చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దీంతో పేటీఎం ఇరానీ కప్‌, మహిళల వన్డే నాకౌట్‌, విజ్జీ ట్రోఫీ, మహిళల అండర్‌-19 టీ-20 లీగ్‌ లు క్యాన్సిల్ కానున్నాయి. ఇంతకుముందే ఇండియా – దక్షిణాఫ్రికా సిరీస్ ని రద్దు చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 

మరోవైపు కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ నెల 31 వరకు షాపింగ్ మాల్స్, విద్యాసంస్థలు, థియేటర్స్ ని మూసేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాదు.. పార్టీలు, సమావేశాలకి దూరంగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తోంది.