చిన్నారికి పుట్టుకతోనే కరోనా

మనసుని కలిచేవేసే వార్త ఇది. బ్రిటన్ లో ఓ చిన్నారికి పుట్టుకతోనే కరోనా వైరస్ సోకింది. ఈ శిశువు తల్లిని ప్రసవానికి కొద్ది రోజులు ముందు న్యుమోనియా సోకిందనే అనుమానంతో లండన్‌లోని నార్త మిడిల్‌సెక్స్‌ యూనివర్సిటీ హాస్పిటల్‌కు తరలించారు. పనిలో పనిగా అక్కడ ఆమెకు కరోనా నిర్ధారణ పరీక్షలు కూడా నిర్వహించారు. ప్రసవానంతరం వచ్చిన ఫలితాల్లో ఆమెకు కరోనా ఉందని నిర్ధారణ అయింది.

ఆమెకి జన్మించిన శిశువుకు కూడా కరోనా పరీక్ష నిర్వహించగా… శిశువుకు కూడా ఈ వ్యాధి సోకినట్టు తెలిసింది. దీనితో తల్లీ బిడ్డలకు వేర్వేరు అస్పత్రులలో చికిత్స అందచేస్తున్నారు. చిన్నారికి గర్భంలో ఉన్నపుడు సోకిందా లేదా పుట్టిన అనంతరమా అనే విషయాన్ని నిర్ధారించటానికి వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు.