పీకల్లోతు అప్పులో విశాల్
‘డిటెక్టివ్ 2’ సినిమా వివాదం నేపథ్యంలో కోలీవుడ్ స్టార్ విశాల్ గురించి షాకింగ్ విషయాలు బయటికొస్తున్నాయి. కోలీవుడ్ హీరో విశాల్‌కు, దర్శకుడు మిష్కన్కు మధ్య గత కొన్నిరోజుల నుంచి వివాదాలు తలెత్తుతోన్న విషయం తెలిసిందే. మిష్కన్ దర్శకత్వంలో విశాల్ కథానాయకుడిగా 2017లో విడుదలైన ‘డిటెక్టివ్’ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అయితే ప్రస్తుతం ‘డిటెక్టివ్’ చిత్రానికి సీక్వెల్‌గా ‘డిటెక్టివ్ 2’ తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో విశాల్-మిస్కిన్ ల మధ్య వివాదం చోటు చేసుకుంది.
మిష్కన్ మొదట అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తున్నారని అందుకే ఆయన్ని ‘డిటెక్టివ్ 2’ ప్రాజెక్ట్ నుంచి తొలగించామని విశాల్ ఇటీవల పలు ఆరోపణలు చేశారు. తాజాగా డిటెక్టివ్ వివాదంపై దర్శకుడు మిస్కిన్ స్పందించారు.మా అమ్మని సైతం అసభ్యపదజాలంతో దూషించాడు. నా సోదరుడిని కొట్టాడని ఆరోపించారు. అంతేకాదు.. డిటెక్టివ్ 2 సినిమా ప్రారంభం అయ్యే సమయానికి విశాల్ తీవ్ర అప్పుల్లో ఉన్నాడని చెప్పుకొచ్చాడు. ఇదీ నిజమా ? విశాల్ కి అప్పులు ఉన్నాయా ?? అన్నది ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.