అలీతో ప్రదీప్ సరదా ముచ్చట్లు
యాంకర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ప్రదీప్ మాచిరాజు. ఆయన హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమా ’30రోజుల్లో ప్రేమించడం ఎలా ?’ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రదీప్ అలీ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న ‘అలీతో సరదాగా’ కార్యక్రమానికి హారయ్యారు. తాజాగా దానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో అలీ-ప్రదీప్ సరదా ముచ్చట్లు నవ్వులు పూయిస్తున్నాయి.
తన ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ సోనాలి బింద్రే అని ప్రదీప్ చెప్పడంతో.. రియల్ లైఫ్ లో ఎవరని అలీ ప్రశ్నిస్తే.. ‘ఇప్పుడవన్నీ ఎందుకు సర్. ఇప్పుడామే ఇద్దరు ముగ్గురు పిల్లలతో హాయిగా సంసారం చేసుకుంటుందని తెలిపారు. నేచురల్ స్టార్ నాని, తాను స్కూల్‌మేట్స్ ప్రదీప్ తెలిపాడు. సుధీర్, రష్మిలతో స్నేహబంధం గురించి ఆసక్తికర ముచ్చట్లు చెప్పాడు. ఆ సరదా ముచ్చట్లు పూర్తిగా వినాలంటే.. రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే. ప్రతిసోమవారం ఈటీవీలో అలీతో సరదాగా ప్రసారం అవుతుంది. రేపు అలీతో ప్రదీప్ ముచ్చట్ల ఏపీసోడ్ ప్రచారం కానుంది.