సుకుమార్ సినిమాలో రొమాంటిక్ హీరోయిన్

‘రొమాంటిక్’ హీరోయిన్ కేతిక శర్మ బంపర్ ఆఫర్ కొట్టేసినట్టు సమాచారమ్. ఆమెని తన సినిమా కోసం తీసుకోవాలని దర్శకుడు సుకుమార్ డిసైడ్ అయ్యారట. సుకుమార్ దర్శకుడిగా, నిర్మాతగానూ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. సుకుమార్ రైటింగ్స్‌, శరత్ మరార్ కలిసి ఓ సినిమాను నిర్మిస్తున్నారు. నాగశౌర్య హీరోగా ఈ సినిమా తెరకెక్కనుంది. కాశీ విశాల్  దర్శకత్వం వహించనున్నారు.

ఈ చిత్రంలో హీరోయిన్‌గా కేతికా శర్మనుఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక సమాచారం రానుందని సమాచారమ్. ఇక పూరి తనయుడు ఆకాష్ హీరోగా నటిస్తున్న రొమాంటిక్ సినిమాతో కేతిక శర్మ తెలుగు తెరకు పరిచయం కానుంది. రొమాంటిక్ కథని స్వయంగా పూరినే అందించారు. ఆయన శిష్యుడు అనిల్ పాడూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రొమాంటిక్ నుంచి వచ్చిన పోస్టర్స్, టీజర్.. ని చూస్తే.. కేతిక శర్మ హాట్ హీరోయిన్ అని అర్థమవుతోంది.