కరోనాపై రాజమౌళి షాకింగ్ ట్విట్

కరోనా వైరస్ ప్రపంచాన్ని గజ గజ వణికిస్తోంది. ఉన్నోడు, లేనోడు, కుల, మత, ప్రధాన మంత్రి, మంత్రి, సెలబ్రేటీ అన్న తేడానే లేదు. అందరికీ కరోనా భయం పట్టుకుంది. స్వయ రక్షణని చూసుకుంటూనే తోటివారిని జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. తాజాగా దర్శకధీరుడు రాజమౌళి కూడా కరోనా గురించి జాగ్రత్తలు చెబుతూ ట్విట్ చేశారు.

‘కరోనా కారణంగా ప్రపంచం నిలిచిపోవడం చూస్తుంటే షాకింగ్‌గా ఉంది. ఇలాంటి పరిస్థితులలో భయాందోళనలు వ్యాప్తి చెందకుండా చూడాల్సిన అవసరం ఎంతైన ఉంది. కోవిడ్ 19 వ్యాప్తిని నివారించడానికి తగిన చర్యలను పాటించండి. కరోనాపై అప్రమత్తంగా ఉంటే మంచింది’ అని రాజమౌళి రాసుకొచ్చారు.

ఇక కరోనా సోకి ఇప్పటికే ప్రపచ వ్యాప్తంగా 6వేల మందికిపైగా మృతి చెందగా.. లక్షా 80వేలకు పైగా కేసులు వెలుగుచూశాయి. ఇక కరోనా ఎఫెక్ట్ తో సినిమా రిలీజ్ డేట్స్, షూటింగ్స్, సినీ ఫంక్షన్స్, ఐపీఎల్, ఇతర టోర్నమెంట్స్, వివాహ వేడుకలు క్యాన్సిల్ అవుతున్న సంగతి తెలిసిందే. అన్నీ రంగాలపై కరోనా ఎఫెక్ట్ చూపిస్తోంది.