బెంగళూరులో మధ్యప్రదేష్ రాజకీయం

జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. బీజేపీలో చేరడంతో మధ్యప్రదేష్ లో రాజకీయ అనిశ్చితి ఏర్పడిన సంగతి తెలిసిందే. జ్యోతిరాదిత్య సింధియాతో వర్గంలో 22మంది ఎమ్మెల్యేలున్నారు. వీరందరినీ బీజేపీ బెంగళూరు తరలించి దాచిపెట్టినట్టు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. వారిని కలిసేందుకు ఆ హోటల్ కి వెళ్లిన మధ్య ప్రదేష్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు.

ఇతర నేతలతో కలిసి రోడ్డుపైనే టీ తాగారు. మధ్యప్రదేశ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ కుట్రలు పన్నిందని ఈ సందర్భంగా ఆయన మండిపడ్డారు. ఇక రెండ్రోజుల క్రితమే సీఎం కమల్ నాథ్ అసెంబ్లీలో బల పరీక్ష నిరూపించుకోవాల్సి ఉండగా.. కరోనా ఎఫెక్ట్ తో మధ్య ప్రదేష్ అసెంబ్లీని ఈ నెల 26వరకు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ లోగా రెబల్ ఎమ్మెల్యేలని బుజ్జగించి.. తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకెళ్లాలనే ప్రయత్నాల్లోనే దిగ్విజయ్ సింగ్ రోడ్డుపై భైఠాయించారు.