నాగబాబుకి దూరం కావడంపై హైపర్ వివరణ
జబర్థస్త్ కమెడియన్ హైపర్ ఆది నాగబాబుకి దగ్గరి మనిషి అని చెబుతుంటారు. నాగబాబు ప్రోత్సాహంతోనే జబర్థస్త్ లో హైపర్ ఆది హవా చూపించారని చెప్పుకొంటున్నారు. అయితే ఇటీవల కాలంలో నాగబాబుకి హైపర్ ఆది దూరమయ్యాడు. అందుకే ‘అదిరింది’ షో నుంచి ఆది తప్పుకొన్నారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆది వివరణ ఇచ్చారు.
జబర్థస్త్, అదిరింది కార్యక్రమాల టీఆర్పీ రేటింగ్స్ గురించి మాట్లాడటం సరికాదు. అన్నీ ప్రోగ్రామ్స్ బాగా నడవాలని కోరుకునే వాడిని అన్నారు హైపర్ ఆది. అయితే అదిరింది నుంచి ఎందుకు బయటికొచ్చినట్టు అంటే.. ? నాగబాబుగారు వెళ్లిన చోట వున్న కొంతమంది వ్యక్తుల గురించి నాకు తెలిసిన నిజాల వలన, నేను ఆయనతో నిలబడలేకపోయాను. నేను ఆ షోకి .. కొంతమంది వ్యక్తులకు మాత్రమే దూరం అయ్యాను. నాగబాబుకు కాదు. ఆయనకి తాను ఎప్పటికీ దగ్గరగానే ఉంటాను అన్నారు ఆది.