అర్జున్ రెడ్డి హీరోయిన్ కోరిక తీరింది

అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలినీ పాండే కోరిక తీరింది. ‘అర్జున్ రెడ్డి’ సంచలన విజయం సాధించడంతో షాలిని పాండే బిజీ హీరోయిన్ అవుతుంది. స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుంది అనుకొన్నారంతా. కానీ ఆమెకి పెద్దగా అవకాశాలు రాలేదు. వచ్చిన అవకాశాలని కొన్ని చేజార్చుకుంది కూడా. ఏ సినిమా పడితే.. ఆ సినిమా చేయనని భీష్మించుకు కూర్చొంది. దీంతో ఒకట్రెండు సినిమాల్లో మాత్రమే షాలినీ నటించగలిగింది. అయితే, తెలుగులో బిజీ కాలేకపోయిన షాలినీ పాండేకి బాలీవుడ్ లో నటించాలనే కోరిక ఉండేదట.

ఇప్పుడా కోరిక తీరింది. ఓ బాలీవుడ్ సినిమాలో అవకాశం లభించిందని ట్విట్ చేసింది షాలినీ. టాలీవుడ్ లో రాణించలేకపోయిన తాప్సీ బాలీవుడ్ కి వెళ్లి.. అక్కడ సత్తా చాటుంది. అక్కడ మంచి నటి అనిపించుకుంది. బ్లాక్ బస్టర్ హిట్స్ అనిపించుకుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది. షాలినీ పాండే కూడా తాప్సీ మాదిరిగా బాలీవుడ్ లో రాణిస్తుందేమో చూడాలి.