కరోనాపై ఈటెల సీరియస్ వార్నింగ్

మనిషి ప్రాణం ముఖ్యం. నిర్లక్ష్యం వద్దు.. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు మంత్రి ఈటెల రాజేందర్. కరోనాపై ఈటెల మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఒక్కరికి కూడా కరోనా సోకలేదని మంత్రి ఈటెల అన్నారు. కేవలం విదేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే కరోనా సోకింది. ఇప్పటి వరకు ఐదుగురికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయ్. వారికి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. కరోనా కట్టడి కోసమే విద్యాసంస్థలకి సెలవులు ఇచ్చాము. తల్లిదండ్రులు పిల్లలని బయటికి వెళ్లనీయవద్దు. జాగ్రత్తగా చూసుకోండి. స్వీయ చర్యలని తీసుకొని జాగ్రత్తగా ఉండమని సూచించారు.

అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయవద్దని మంత్రి ఈటెల సూచించారు. గుంపులుగా ప్రజలు బయట తిరగవద్దు. స్కూళ్లు, కాలేజీలకి సెలవులు ఇచ్చింది బయట తిరగడానికి కాదు. తల్లిదండ్రులు పిల్లలని బయటికి పంపవద్దు. కరోనా వైరస్ ని ఆశామాషిగా తీసుకోవద్దు. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అన్నారు మంత్రి ఈటెల. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలని నమ్మవద్దని కోరారు.