రాజ్యసభకు కేకే, సురేష్ రెడ్డిల ఎన్నిక ఏకగ్రీవం

కేకే, సురేష్‌రెడ్డిలు రాజ్యసభకు ఏకగ్రీవం అయ్యారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. పోటీ లేక పోవడంతో కేశవరావు, సురేష్‌రెడ్డిల ఎన్నిక ఏకగ్రీవమైనట్టు తెలిపింది. రాజ్యసభ ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో రెండు స్థానాలకి నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. ఆ రెండు స్థానాలు తెరాస గెలుచుకునే అవకాశం ఉండటంతో.. కేకే, సురేష్ రెడ్డిలకి అవకాశం ఇచ్చారు సీఎం కేసీఆర్. పోటీలేకపోవడంతో వీరిద్దరి ఎన్నిక ఏకగ్రీవం అయిందని ఎన్నికల సంఘటం ప్రకటించింది.

రాజ్యసభ సీటు కోసం చాలామంది గులాభి నేతలు ప్రయత్నాలు చేశారు. కానీ సీఎం కేసీఆర్ కేకకి మరో అవకాశం ఇచ్చారు. కూతురు కవితని కాదని కేకేని మరోసారి రాజ్యసభకి పంపడం విశేషం. ఇక కవితకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి సంతోషపెట్టారు. అంతేకాదు.. ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన కవితకి మంత్రి పదవి కూడా ఇవ్వబోతున్నట్టు సమాచారమ్. ఓ కీలకశాఖని కవితకి అప్పగించే అవకాశాలున్నాయని చెపుకొంటున్నారు.