మందు కొడితే కరోనా రాదా ?

ప్రపంచ దేశాలని కరోనా వైరస్ వణికిస్తోంది. అయితే ఈ భయంకరమైన వైరస్ పట్ల మందు బాబులు ఏమాత్రం బయపడటం లేదు. ఎందుకంటే ? మందు కొట్టేవారికి కరోనా రాదని చెబుతున్నారు. శానిటైజర్స్ లో ఆల్కాహాల్ ఉంటుంది. ఈ లెక్కన ఆల్కాహాల్ తీసుకొనేవారికి కరోనా భయం అవసరం లేదని మందుబాబులు వాదిస్తున్నారు. అయితే అందులో ఏమాత్రం నిజం లేదని డాక్టర్లు చెబుతున్నారు.

ఆల్కాహాల్ లో ఎలాంటి ఔషధం ఉండదు. పైగా ఆల్కాహాల్ రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. ఆల్కాహాల్ తీసుకుంటే కరోనా రాదన్నది ఉత్తి ప్రచారమేనని డాక్టర్లు చెబుతున్నారు. శుభ్రతని పాటించడం ఒక్కటే కరోనా రాకుండా కాపాడుతుందని చెబుతున్నారు. చేతులని శుభ్రంగా కడుక్కోవాలి. ఏమాత్రం అస్వస్థతకి గురైనా వైద్యులని సంప్రదించడం బెటర్ అని సూచిస్తున్నారు.