కరోనా ఎఫెక్ట్ : 2వేల కోళ్లని సజీవ సమాధి

భారత్ లో కరోనా అనుమానితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే 166కేసులు నమోదయ్యాయ్. మరోవైపు కరోనా ఎఫెక్ట్ తో పౌల్ట్రీ పరిశ్రమపై తీవ్రంగా పడింది. చికెన్ తింటే కరోనా వస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండటంతో.. చికెన్ కొనేందుకు, తినేందుకు జంకుతున్నారు. ఈ నేపథ్యంలో చికిన్ ధరలు భారీగా పడిపోయాయ్. దీనితో పౌల్ట్రీ రైతులు ఏమి చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. 

ఇటీవలే కర్ణాటకకు చెందిన ఓ రైతు ఏకంగా ఐదు వేల కోళ్లను సజీవ సమాధి చేసిన ఘటన చూశాం. కేరళ ప్రభుత్వం కూడా కోళ్లను పూడ్చిపెట్టింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు కూడా కోళ్లను పూడ్చిపెడుతున్నారు. వరంగల్ జిల్లా చెన్నరావుపేటకు చెందిన చాపర్తి రాజు అనే రైతు ప్రజలకు ఉచితంగా కోళ్లను పంపిణీ చేశాడు. మరో 2 వేలుపైగా ఉన్న కోళ్లను బ్రతికుండగానే పూడ్చి పెట్టాడు.