2008లోనే స్వీటీ ప్రేమలో పడిందట
స్వీటీ అనుష్కపై ప్రేమ పుకార్లు కొత్తేమీ కాదు. మొదట్లో ఓ సీనియర్ హీరోతో అనుష్కకు లింకు ఉన్నట్టు ప్రచారం జరిగింది. ఇక బాహుబలి సినిమా నుంచి అనుష్క-ప్రభాస్ ప్రేమలో పడ్డారు. సీక్రెట్ గా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి కూడా చేసుకోబోటున్నారనే ప్రచారం జరిగింది. ఇవి పుకార్లేనని ప్రభాస్, అనుష్క ఇద్దరు ఖండించినా.. పుకార్లకి మాత్రం పులిస్టాప్ పడటం లేదు.
దీనిపై ఇటీవల మరోసారి స్పందించిన అనుష్క.. ప్రభాస్ తనకి 3ఏఎమ్ ఫ్రెండు. ఆ సమయంలో కూడా ఫోన్ చేసి మాట్లాడగలను. అంత చనువు ఉందని తెలిపింది. ఇంతలోనే మరో షాకింగ్ న్యూస్ కూడా చెప్పింది స్వీటీ. 2008లో ఓ ఒకరితో బ్యూటిఫుల్ రిలేషన్ షిప్ ఉండేది. అతనితో ఇప్పటి వరకు కలిసి ఉంటే కచ్చితంగా పేరు చెప్పేదాన్ని. కానీ నేను పెళ్లి చేసుకున్న రోజు అతడెవరో మీకే తెలిసిపోతుందని సస్పెన్స్ లో పెట్టింది. స్వీటీ మాటలని బట్టీ ఉంటే అతడితోనే నా పెళ్లి అన్నట్టుగా ఉంది. అతడే ప్రభాస్ అయితే.. అభిమానులకి ఇంతకంటే శుభవార్త ఇంకోటి ఉండదేమో.