పాగల్ టైటిల్’తో విశ్వక్ సేన్ సినిమా

తిట్లు టైటిల్స్ అవుతున్నాయ్. ఈ క్రెడిట్ మాత్రం దర్శకుడు పూరి జగన్నాథ్ దే. రవితేజని ‘ఇడియట్’ చేశారాయన. మహేష్ ని ‘పోకిరి’ని చేశారు. బ్లాక్ బస్టర్ హిట్స్ అందించారు. ట్రెండ్ సెట్ చేశారు. ఆ తర్వాత కూడా బోలేడు తిట్లు టైటిల్స్ గా వచ్చాయ్. 

తాజాగా ‘పాగల్’ టైటిల్ తో సినిమా రాబోతుంది. విశ్వక్ సేన్ కొత్త సినిమా టైటిల్ ఇది. కొత్త దర్శకుడు నరేష్ కుప్పలి దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. రానా దగ్గుబాటి తొలి క్లాప్ కొట్టారు. పూజా కార్యక్రమం సందర్భంగా ‘పాగల్‌’ టైటిల్‌ పోస్టర్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. ఈ సినిమాకు బెక్కం వేణుగోపాల్‌ నిర్మాతగా వ్యవహరించనున్నారు.