కరోనా.. చైనాలో తగ్గుముఖం !

చైనాలో పుట్టిన భయంకరమైన కరోనా వైరస్.. ఇప్పుడు బయటిదేశాల్లో విజృంభిస్తోంది. చైనాలో మాత్రం ఈ వైరస్ కట్టడిలోకి వచ్చినట్టు కనబడుతోంది. బుధవారం కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదని చైనా ఆరోగ్య కమిషన్‌ అధికారులు ప్రకటించారు.

‘చైనాలో అంతర్గతంగా బుధవారం కొత్తగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. విదేశాల నుంచి వచ్చినవారిలో 34 కేసులు కొత్తవి నమోదయ్యాయి.. వాటిలో 21 బీజింగ్‌లో, మరో రెండు షాంఘై, 9 కేసులు గ్వాంగ్‌ డాంగ్‌ ప్రావిన్సుల్లో నమోదయ్యాయి. కరోనాతో బయటి దేశాల నుంచి చైనాకు వచ్చిన వారి సంఖ్య 189కి చేరింది. గత డిసెంబర్‌ నుంచి వైరస్‌ ప్రభావంతో అట్టుడికిన హుబెయ్‌లోనూ ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం’ అని ఎన్‌హెచ్‌సీ అధికారులు వెల్లడించారు.