కరోనా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

ప్రపంచ దేశాలని వణికిస్తున్న కరోనా వైరస్ పై అధ్యయనంలో కొత్త కొత్త విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. అవి షాక్ కి గురిచేస్తున్నాయి. కరోనా వైరస్ గాల్లో 3 గంటలపాటు సజీవంగా ఉండి మానవుల్లోకి ప్రవేశించగలదని తాజా అధ్యయనంలో తేలింది.  అంతేకాదు.. ప్లాస్టిక్ ఉపరితలాలపై మూడు రోజుల వరకూ క్రియాశీలకంగా ఉండగలదని తేల్చింది. 

ప్రపంచవ్యాప్తంగా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటానికి ఈ సామర్థ్యమే ప్రధాన కారణమని చెబుతున్నారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం పరిశోధకులతో కూడిన బృందం ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 8,809 మంది మృతి చెందారు. దాని బారిన పడిన వారి సంఖ్య 2,18,631కి చేరింది. చైనాలో ఇప్పటి వరకు మొత్తం నిర్ధారణ అయిన కేసుల సంఖ్య 80,928కి చేరింది. మొత్తం 3,245 మంది మృతి చెందారు. భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 166కి చేరింది. ఇక తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13కి చేరగా, ఏపీలో 2కి చేరింది.