ఈసారి వాయిదా లేదు.. రేపే నిర్భయ దోషులకి ఉరి !

నిర్భయ దోషులకి ఉరి అమలు ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. గతంలో జనవరి 22, ఫిబ్రవరి 1, మారి 3న నిర్భయ దోషులకి ఉరిశిక్ష అమలు వాయిదా పడ్డాయి. న్యాయ వ్యవస్థలోని లొసుగులని వాడుకుంటూ నిర్భయ దోషులు ఉరిశిక్ష అమలుని వాయిదా పడేలా చేసుకున్నారు. అయితే రేపు (మార్చి 20) నిర్భయ దోషులకి ఉరి అమలు ఖాయమైంది.

రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించడాన్ని సవాల్‌ చేస్తూ అక్షయ్‌ కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మరణ శిక్షను జీవిత ఖైదుగా కుదించాలని పవన్‌ గుప్తా పెట్టుకున్న క్యురేటివ్‌ పిటిషన్‌ను కూడా కోర్టు కొట్టివేసింది. ఈ నలుగురు దోషులు ఇప్పటికే న్యాయపరంగా ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 5:30 నిమిషాలకి నిర్భయ దోషులకి ఉరిశిక్ష అమలు చేయబోతున్నారు.

ఇప్పటికే తలారి పవన్ జల్లాద్ తీహార్ జైలుకి చేరుకున్నారు. దోషుల్ని ఉరికి సంబంధించి రిహార్సల్ కూడా నిర్వహించారు. ఇక ఒకే కేసులో నలుగురు దోషుల్ని ఒకేసారి ఉరి తీయడం తీహార్ జైలు చరిత్రలోనే ఇదే తొలిసారి.