కంట‌త‌డి పెట్టిన మోత్కుప‌ల్లి…!! ఎందుకో తెలుసా..?

ఇర‌వైరెండేళ్లుగా పోరాటం చేస్తున్న మంద కృష్ణ ను అరెస్ట్ చేయడం దారుణమ‌ని, ఇది కేసీఆర్ నియంతృత్వ పోకడ కు నిదర్శనమ‌ని టీడీపీ పొలిట్ బ్యూరో స‌భ్యులు , సీనియ‌ర్ నాయ‌కులు మోత్కుప‌ల్లి న‌ర్సింహులు అన్నారు. ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌పై మూడేళ్ళక్రితం తీర్మానం చేసిన ప్రభుత్వం ఆ విషయాన్ని ఎందుకు మరుగున పడేసిందని ఆయ‌న ప్ర‌శ్నించారు. ట్యాంక్ బండ్ వ‌ద్ద అంబెద్క‌ర్ విగ్ర‌హం వ‌ద్ద దీక్ష చేప‌ట్టిన ఆయ‌న ప్ర‌భుత్వ వైఖ‌రిపై విమ‌ర్శ‌లు గుప్పించారు.

తాము కేసీఆర్ కు వ్యతిరేకం కాద‌ని, అనగదొక్కుతే తిరగబడతామ‌ని ఆయ‌న అన్నారు. ప్రభుత్వాన్ని నిలబెట్టాలన్నా, పడగొట్టాలన్నా మాదిగలే అన్న విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలని చెప్పారు. అఖిల పక్షాన్ని ఢిల్లీ కి ఎప్పుడు తీసుకువెళ్తారో చెప్పాలన్నారు మోత్కుప‌ల్లి.

ఎస్సిలందరు ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైనద‌ని, కేసీఆర్ అంతుచూస్తామంటూ ఆయ‌న హెచ్చ‌రించారు. మాదిగలను అంటరాని వారిగా చూస్తున్నార‌.ఇ, క్యాబినెట్ లో దళితులకు స్థానం కూడా కల్పించలేదని ఆయ‌న విమ‌ర్శించారు. మౌన దీక్షకు ఉపక్రమిస్తే అరెస్టు అంటున్నారని, ఇది చాలా దారుణ‌మ‌ని అన్నారాయ‌న‌. అంబెద్క‌ర్ విగ్ర‌హం వ‌ద్ద మాట్లాడుతూ భావోద్వేగంతో ఒక్క‌సారిగా మోత్కుప‌ల్లి కంట‌త‌డి పెట్టారు. మంద కృష్ణ ను వెంటనే విడుదల చేయాలని, కేసులు ఎత్తివేయాల‌ని ఆయ‌న ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు.