కరోనా టైటిల్స్’కు ఫుల్ డిమాండ్
భారతీయ సినిమా తీరుమారుతోంది. రొటీన్ కథలు కాకుండా.. జీవిత కథలు, యదార్థ ఘటనలు, తాజా పరిస్థితులపై సినిమాలొస్తున్నాయ్. మంచి విజయాలని సాధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రపంచ దేశాలని గజ గజ వణికిస్తోన్న కరోనా పై సినిమా వాళ్లు కళ్లుపడ్దాయి. కరోనా టైటిల్స్ ని రిజిస్టర్ చేసుకునేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు.
కరోనా వైరస్ ఎలా పుట్టింది ? దానికి కారణం ఎవరు ?? దాని వలన ప్రపంచ దేశాలు ఎంతలా ఇబ్బంది పడ్డాయ్?? ఆఖరికి దాన్ని ఎలా ఎదుర్కొన్నారు ??? అన్నది రాస్తే అద్భుతమైన కథ. తీస్తే బ్లాక్ బస్టర్ హిట్టే. ఈ నేపథ్యంలో కరోనా టైటిల్స్ కి డిమాండ్ పెరిగింది. పెద్ద, చిన్నా చితక నిర్మాతలు కరోనా వైరస్ టైటిల్స్ ని రిజిస్టర్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇందుకోసం క్రియేటివిటీ అంతా వినియోగిస్తున్నారు. నిఫా వైరస్ ఆధారంగా మలయాళంలో వచ్చిన “వైరస్” సినిమా మంచి విజయాన్ని సాధించింది. రాబోయే ఒకట్రెండు యేళ్లలో కరోనా వైరస్ నేపథ్యంలో సినిమాలు క్యూ కట్టే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మరీ.. టాలీవుడ్ లో ఆ దిశగా ప్రయత్నాలు ఏ దర్శక-నిర్మాతలు చేస్తారన్నది చూడాలి.