వరల్డ్ కప్ కూడా వాయిదా

ఏప్రిల్ 10 నుంచి జరగాల్సిన వరల్డ్ కప్ వాయిదా పడింది. కపిల్ నేతృత్వంలోని భారతజట్టు 1983 వన్డే వరల్డ్ కప్ ని గెలిచిన సంగతి తెలిసిందే. ఆ మధుర క్షణాలని తెరపై చూపించబోతున్నారు కబీర్‌ ఖాన్‌. ఈ సినిమాలో కపిల్‌దేవ్‌గా రణ్‌వీర్‌ సింగ్‌.. కపిల్‌ సతీమణి రోమీ భాటియాగా దీపికా పదుకొణె నటించారు. కరోనా కారణంగా ప్రస్తుతం ఈ చిత్రాన్ని వాయిదా వేశారు.

ప్రస్తుతం కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రతిఒక్కరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ’83’ సినిమా విడుదలను నిలిపివేస్తున్నాం. పరిస్థితులు మెరుగుపడిన తర్వాత సినిమా విడుదల విషయంపై నిర్ణయం తీసుకుంటాం. కరోనా నివారణకు తగిన జాగ్రత్తలను పాటించాలని అభిమానులకు తెలియజేస్తున్నాం. కష్టాలను ఎదుర్కొని విజయాన్ని సాధించడమే మా ’83’ చిత్రం. అలాగే మనం కూడా ఈ కరోనా కష్టం నుంచి త్వరలోనే బయటపడతామని ఆశిస్తున్నాం.’ అని చిత్రబృందం పేర్కొంది.